నేడు వరంగల్‌కు సీఎం కేసీఆర్..కారణం ఇదే

-

సీఎం కేసీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరనున్న సీఎం కేసీఆర్… జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రితో పాటు ఇతర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాదుకు చేరుకొనున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి… పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వారం రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధిపై చేపట్టిన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడడానికి ముందున్న పరిస్థితులు చేపట్టిన అభివృద్ధి అంశాలను లెక్కలతో సహా ప్రజలకు వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version