శంషాబాద్‌ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు

-

శంషాబాద్‌ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత సమయపాలన కలిగిన విమానాశ్రయంగా నిలిచింది. ఏవియేషన్‌ అనలిటికల్‌ సంస్థ ‘సిరియమ్‌’ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదికలో శంషాబాద్‌ విమానాశ్రయం మార్చి నెలలో 90.43% ఆన్‌-టైమ్‌ పెర్ఫార్మెన్స్‌ నమోదు చేసింది. సమయపాలనలో 90% మార్కును దాటిన ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయంగా నిలిచింది. గతేడాది నవంబర్‌లో సమయపాలన సూచిలో 88.44 శాతంతో నాల్గో స్థానంలో ఉండగా కేవలం 4 నెలల్లోనే ప్రథమ స్థానం దక్కించుకుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

సిరియమ్‌ సంస్థ మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని 50 లక్షల విమానాల రాకపోకలను విశ్లేషించింది. ఈ క్రమంలోనే సమయపాలనతోపాటు ‘గ్లోబల్‌ ఎయిర్‌పోర్ట్‌’ ‘లార్జ్‌ ఎయిర్‌పోర్ట్‌’ విభాగాల్లోనూ శంషాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. వాస్తవ నిష్క్రమణ సమయం (డిపార్చర్‌) 80 శాతం, ప్రయాణికులు లోపలికి అడుగుపెట్టాక విమానం ఎక్కే సమయం, విమానాశ్రయ సేవల అంశాలను ఆ సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఈ 3 అంశాల్లో అత్యుత్తమంగా శంషాబాద్‌ విమానాశ్రయం నిలిచిందని విమానాశ్రయ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version