ఈ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తో రూ.69 లక్షలు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది చిన్న మొత్తాల పొదుపు పథకాల లో డబ్బులు పెడుతూ వుంటారు. మంచిగా వడ్డీ కూడా వస్తుంది. కేంద్రం అందించే స్కీముల్లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన పథకంలో వడ్డీని 40 బేసిస్ పాయింట్స్ ని కేంద్రం పెంచింది కూడా. దీనితో వడ్డీ రేటు 7.60 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది. పథకంలో ఎంత పొదుపు చేస్తే రూ.69 లక్షల వరకు రిటర్న్స్ వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం.

కేంద్రం ఈ స్కీము వడ్డీ రేటు ని పెంచింది కాబట్టి రిటర్న్స్ కూడా పెరుగుతాయి. తల్లిదండ్రులు తమ అమ్మాయి పేరు మీద ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. పిల్లల పై చదువులు, పెళ్లి ఖర్చుల గురించి చాలా ముందు నుండి కూడా పొదుపు చేస్తారు. మీరు కూడా మీ పిల్లల పేరు మీద ఈ స్కీము లో డబ్బుల ని పెట్టచ్చు. గరిష్టంగా ఏటా రూ.1,50,000 వరకు జమ చెయ్యచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందొచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో 10 ఏళ్ల లోపే చేరాల్సి వుంది. 18 ఏళ్లు వచ్చే వరకు అకౌంట్ ని ఆపరేట్ చెయ్యచ్చు. 15 ఏళ్లు డబ్బులు జమ చెయ్యవచ్చు.

21 ఏళ్ల వరకు ఆ పెట్టుబడిని అలానే ఉంచేసి ఎక్కువ రిటర్న్స్ పొందొచ్చు. ఈ పథకంలో ప్రతీ నెలా రూ.12,500 చొప్పున ఏడాదికి రూ.1,50,000 పొదుపు చేస్తే.. 15 ఏళ్లు పొదుపు చేస్తే రూ.22,50,000 అవుతుంది. 21 ఏళ్ల వరకు అకౌంట్ అలా ఉంచితే ప్రస్తుత వడ్డీ రేటు 8 శాతం ప్రకారం మొత్తం రూ.47,30,097 శాతం మీకు వడ్డీ వస్తుంది. అసలు, వడ్డీ మొత్తం రూ.69,80,093 రిటర్న్స్ మీకు వస్తాయి. ప్రతీ నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే రూ.9,00,000 అవుతుంది. 8 శాతం వడ్డీ ప్రకారం రూ.18,92,031 వడ్డీ మీకొస్తుంది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.27,92,037 రిటర్న్స్ వస్తాయి. ప్రతీ మూడు నెలలకు ఓసారి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version