వినాయక నిమజ్జనంపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

-

 

వినాయక నిమజ్జనంపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. వినాయక చవితి పర్వదినం ప్రారంభం నుంచి నేటి వరకు వాడ వాడనా గణేష్ మండపాల ఏర్పాటు, పూజా కార్యక్రమాలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయని, ఈ సందర్భంగా దైవ ప్రార్థనలు,భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ సహా పలు ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. వర్షాల నేపథ్యంలో తగు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, నిమజ్జనం కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో పాల్గొని, క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సీఎం కేసిఆర్ సూచించారు. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు రావడం దైవేచ్ఛ అని సీఎం అన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగలు జరుపుకుంటూ తెలంగాణ ‘గంగా జమున తెహజీబ్’ ను మరోసారి ప్రపంచానికి చాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news