తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పదేళ్ల తెలంగాణ వేడుకలను ఎప్పటినుంచి, ఎన్ని రోజులపాటు నిర్వహించాలనే దానిపై అధికారులతో చర్చిస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు చేసిన కసరత్తును సీఎం సమీక్షలో చర్చిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, బహిరంగ సభ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు, హైదరాబాద్ లో వారం రోజులపాటు ఈ వేడుకలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. ఈ ఉత్సవాలలో అమరుల త్యాగాలను స్మరించుకోవడం సహ తెలంగాణ ప్రగతి ప్రస్తానాన్ని కళ్ళకు కట్టేలా కార్యక్రమాలు ఉండేలా చూస్తున్నారు. ఇందుకోసం సంబంధిత అంశాలపై అన్ని శాఖల కార్యదర్శిలతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు.