BREAKING: 7వ గ్యారెంటీ ప్రకటించిన సీఎం రేవంత్‌ !

-

BREAKING: 7వ గ్యారెంటీ ప్రకటించారు సీఎం రేవంత్‌. ఏడో గ్యారెంటీ కింద…ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించినట్లు తెలిపారు సీఎం రేవంత్‌. 78 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు చారిత్రక గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు అందించిందని తెలిపారు. అలాగే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ ప్రిలిమినరీ, 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించామని తెలిపారు. అలాగే వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచామని చెప్పుకొచ్చారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని.. తాము పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

CM Revanth announced the 7th guarantee

యువత చెప్పుడు మాటలు విని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు రేవంత్ రెడ్డి. పెద్దన్నగా మీ అందరికీ అండగా ఉంటానని యువతకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ 3న నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం పొందారని అన్నారు. గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు రేవంత్ రెడ్డి. ఇక రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే త్వర లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పటివరకు రెండు విడతల్లో రైతు రుణమాఫీ చేశామని.. రుణమాఫీ కానీ రైతులు నిరుత్సాహపడవద్దని అన్నారు. వారందరి కోసం త్వరలోనే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news