మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడులో ప్రచారానికి రేవంత్

-

రాష్ట్ర ముఖ్యమంత్రి ఓవైపు ప్రజాసంక్షేమంపై దృష్టి సారిస్తూనే పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా 12 సీట్లకు పైగా సాధించాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ దిశగా వ్యూహాలు రచిస్తూ ఎప్పటికప్పుడు ఎంపీ అభ్యర్థులు, లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమవుతూ మార్గనిర్దేశం చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలోనూ బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది.

ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఛరిష్మాను తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకోవాలని ప్లాన్ వేస్తోంది. రాష్ట్రం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో రేవంత్తో ప్రచారం చేయించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్‌రెడ్డికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్‌ భారీగా పెరిగింది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవల వైజాగ్‌లో ఏపీసీసీ నిర్వహించిన బహిరంగసభకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ క్రేజ్‌ను ఇతర రాష్ట్రాల్లోనూ వాడుకునేలా కాంగ్రెస్‌ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version