ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో, కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఉప్పల్లో.. 9 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే ఏం లాభం లేదని చెబుతున్న రేవంత్.. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాదిరి.. మిగిలిన హామీలు కూ డా నెరవేర్చుతామని చెబుతున్నారు. పదిహేను ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచారంలో జోరు సాగిస్తున్న సీఎం.. విపక్షాలకు సంబంధించిన ఏ పాయింట్ను వదలకుండా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అలాగే తమ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.