నిజామాబాద్లోనే పసుపుబోర్డు హెడ్ ఆఫీస్!

-

నిజామాబాద్లో పసుపు ఎక్కువగా పండుతుంది కాబట్టి ఇక్కడే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇందూరులోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ అర్వింద్ మోదీ వెంటపడి మరీ ఆయణ్ను ఒప్పించారని తెలిపారు. అర్వింద్ను మరోసారి ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అలాగే బీడీ కార్మికుల కోసం ఆస్పత్రి కట్టిస్తామని అన్నారు.

నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన అమిత్‌షా.. అర్వింద్‌ను గెలిపిస్తేచక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా . తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుందని దుయ్యబట్టారు. రాహుల్, రేవంత్ పేరుతో ఆర్ఆర్ టాక్స్ వేసి, దిల్లీకి తరలిస్తున్నారని షా ఆరోపించారు. ఏబీసీ అంటే అసదుద్దీన్‌ ఒవైసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేదని, ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్‌ ముగిసిందని, తొలి రెండు విడతల్లో కమలం పార్టీ సెంచరీ కొడుతుందని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version