నేడు తెలంగాణకు జేపీ నడ్డా

-

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే జాతీయ నేతలను రంగంలోకి దింపింది. ప్రధాని మోదీ సహా అమిత్ షా, జేపీ నడ్డా వంటి కీలక నేతలు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేశారు. ఇంకా జాతీయ నేతలు రాష్ట్రానికి వరుస కడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నాయి. ఆయనతో పాటు రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ధామి, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

తొలుత పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరై అనంతరం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్‌లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ నిర్వహించే సభలో నడ్డా పాల్గొననున్నారని పార్టీనేతలు వెల్లడించారు. మరోవైపు ఈరోజు ఉదయం ముషిరాబాద్‌ మీటింగ్‌లో ఉత్తరాఖండ్ సీఎం పాల్గొని మధ్యాహ్నం 12.30 కు నర్సంపేట సభకు హాజరవుతారు. సాయంత్రం సికింద్రాబాద్‌లోని సమ్మేళనంలో గుజరాత్ సీఎం పాల్గొననుండగా.. జమ్మికుంటలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కల్వకుర్తి సభలో పాల్గొని.. అనంతరం సనత్‌నగర్ నుంచి పద్మారావునగర్ వరకు బైకు ర్యాలీలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version