కేటీఆర్‌ సెల్ఫీలు దిగే శిల్పారామాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్సే : సీఎం రేవంత్

-

హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ దూరదృష్టి నిర్ణయాల వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని తెలిపారు. కేటీఆర్‌ సెల్ఫీలు దిగే శిల్పారామాన్ని కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్‌ వచ్చాయన్న రేవంత్, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగింది ఏం లేదని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం. రెండో దశలో 75 కి.మీ మెట్రో విస్తరణ చేపట్టబోతున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తాం. ఎన్నికలయ్యాక రాష్ట్ర అభివృద్దే మా ధ్యేయం. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ధర్నాచౌక్‌లో ధర్నా చేపట్టాలి. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ధర్నా చేస్తే కాంగ్రెస్‌ పూర్తిగా సహకరిస్తుంది. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో బేషజాలకు వెళ్లం. అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version