లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు నీరు అందలేదు: సీఎం రేవంత్

-

తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు వెళ్లి దెబ్బ తిన్న ఆనకట్టను పరిశీలించింది. శాసనసభ, మండలి సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక బస్సులో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ లోని పియర్స్‌ను పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కనీసం లక్ష ఎకరాలకు నీరు అందలేదని అన్నారు. కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పారని మండిపడ్డారు. అక్టోబర్‌ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు చెప్పారని, నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చెప్పిందని తెలిపారు.

“2020-21లోనే సమస్య ఉందని ఇంజినీర్లు చెప్పారు. సమస్యను చక్కదిద్దే పని చేపట్టకుండా నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు. కాళేశ్వరం రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25 వేల కోట్లు అవసరం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఏ బ్యారేజీలోనూ ఇప్పుడు నీరు లేదు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో ఒకే తరహా సమస్య ఉంది. వానాకాలం నీరు వస్తే.. సుందిళ్ల, అన్నారంలో కూడా సమస్యలు బయటడపడతాయి.” అని సీఎం రేవంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version