మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి

-

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి నివాళులర్పించారు. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం మన్మోహన్ పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రేవంత్ రెడ్డి తో పాటు మన్మోహన్ కి నివాళులు అర్పించిన వారిలో రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇక ఈరోజు సాయంత్రం హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కానున్నారు రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రేపటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు తెలంగాణలో జనవరి మూడో తేదీ వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు మన్మోహన్ సింగ్ కి నివాళి అర్పించారు. శనివారం రోజున కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎంపీలు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలో పాల్గొనే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news