పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్ సంతాపం తెలిపారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన పద్మశ్రీ రామయ్య మరణం ఈ సమాజానికి తీరని లోటు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వనజీవి రామయ్య చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

మనందరం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తేనే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.