చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు రంగరాజన్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
అంతకు ముందు ఈ దాడి ఘటనను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. రామరాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడిన్న వారిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాముడి పేరును బద్నామ్ చేస్తూ.. అరాచక, అనాగరిక కార్యక్రమాలకు పాల్పడటం దుర్మార్గం అన్నారు. ఇది క్షమించరాని నేరం అన్నారు. రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్యగా పేర్కొన్నారు. మరోవైపు దాడి కేసుకు సంబంధించి ఒకరినీ అరెస్ట్ చేసినట్టు మొయినాబాద్ పోలీసులు తెలిపారు.