కేసీఆర్ కు గౌరవం లేకుండా చేస్తున్నావ్.. కేటీఆర్ పై మంత్రి తుమ్మల ఫైర్..!

-

పదేళ్లు అధికారంలో ఉండగా రైతుల గురించి మాట్లాడని కేటీఆర్ ఈ ఏడాది కాలంలో రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఏంటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి అధ్వానంగా మార్చారని దుయ్యబట్టారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు మంత్రి తుమ్మల. రైతుల వద్ద కేసీఆర్ కి ఉన్న కాస్తో.. కూస్తో ఉన్న గౌరవం కేటీఆర్ తీస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతుల గురించి ఏనాడు ఆలోచన చేయని కేటీఆర్ ఇవాళ సిగ్గులేకుండా మాపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు మండిపడ్డారు.

కేటీఆర్ వ్యవసాయ శాఖ అంశాన్ని వదిలేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లాభం దక్కుతుంది. లేదంటే.. ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని విమర్శించారు. పదేళ్ల ప్రభుత్వంలో రైతుబంధు ఎంత ఇచ్చామో అనే సోయి లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news