కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ…కాంగ్రెస్‌కు డబుల్ ఇంజన్‌లు – సీఎం రేవంత్‌

-

కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ…కాంగ్రెస్‌కు డబుల్ ఇంజన్‌లు అన్నారు సీఎం రేవంత్‌. వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు డబుల్ ఇంజన్‌లు అని… ఈ డబుల్ ఇంజన్‌లు 3 లక్షల మెజారిటీ తెచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తామని కాంగ్రెస్‌కు మాటిచ్చారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

cm revanth reddy comments on komatireddy brothers

ఆదివారం కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజమైన పోరాట యోధుడు అని ప్రశంసల వర్షం కురిపించారు.తెలంగాణ కోసం తెగించి, సొంత పార్టీ ఎదురించి పోరాటం చేశారని.. కేసీఆర్ లాగా నకిలీ ఉద్యమం నడిపించలేదని అన్నారు.మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని,తెలంగాణ స్వరాష్ట్రం కావాలని కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ హైకమాండ్‌ను ఒప్పించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version