తెలంగాణకు రూ.1800 కోట్లు ఇవ్వండి – సీఎం రేవంత్‌

-

తెలంగాణకు రూ.1800 కోట్లు ఇవ్వండని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సీఎం రేవంత్‌ రెడ్డి. గడియిర రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గ‌డిపారు రేవంత్‌. వెనుక‌బడిన ప్రాంతాల అభివృద్ధి కింద తెలంగాణ‌కు 2019-20 నుంచి 2023-24 వ‌ర‌కు సంవ‌త్స‌రానికి రూ.450 కోట్ల చొప్పున తెలంగాణ రాష్ట్రానికి రావలసిన రూ.1800 కోట్లు విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్‌ కు రేవంత్‌ రెడ్డి విజ్ఙ‌ప్తి చేశారు.

CM Revanth Reddy continues meetings in Delhi

నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఆమె కార్యాల‌యంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ క‌లిశారు.15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.2,233.54 కోట్లు త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం, మంత్రి ఉత్తమ్‌ కోరారు. హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధికి ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి వి. శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version