బీఆర్ఎస్ నాయకులను లోపల వెయ్యడానికే నన్ను ముఖ్యమంత్రిని చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం హాట్ కామెంట్స్ చేశారు.

తమ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉండేవారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతీకార రాజకీయాలు తనకు రావని.. నేను అలా చేసుంటే ఇప్పటికే కొందరు జైల్లో ఉండేవారని వ్యాఖ్యానించారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారని గుర్తు చేశారు.