నక్సలైట్లు ఉండే డిటెన్షన్ సెల్లో వేశారు.. 16 రోజులు నిద్రలేదు : సీఎం రేవంత్

-

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తనను జైలుకు పంపిన రోజులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రసంగిస్తూ కక్షపూరిత రాజకీయాల గురించి ఆయన మాట్లాడారు. తాను కూడా ప్రతీకార రాజకీయాలు చేసుంటే కేసీఆర్ కుటుంబమంతా జైల్లో ఉండేదని వ్యాఖ్యానించారు. డ్రోన్ ఎగరేసినందుకు రూ.500 ఫైన్ వెయ్యాలి కానీ తనను అరెస్ట్ చేసి జైలులో పెట్టారని తెలిపారు. మామూలుగా 7 సంవత్సరాల లోపల శిక్ష ఉంటే రిమాండ్‌కు పంపకుండా, బెయిల్ ఇవ్వాలి.. కానీ అధికారాన్ని అడ్డుబెట్టుకొని తనను చర్లపల్లి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతటితో ఆగకుండా గత ప్రభుత్వం తనను నక్సలైట్లు, తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో వేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. 16 రోజులు ఒక్క మనిషిని చూడకుండా తనను నిర్బంధించినా.. ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ పనిచేస్తున్నానని వెల్లడించారు. తనను నిద్రపోకుండా చేయడానికి లైట్లు కూడా స్విచ్ఛాఫ్ చేయలేదని.. 20, 30 పెద్ద పెద్ద బల్లులు.. పురుగులు తింటుంటే ఒక్కరోజు కూడా తాను నిద్ర పోలేదని చెప్పారు. సెల్లో చిన్న బాత్ రూమ్ లో కూర్చుంటే బైటకి కనిపించే లాగా ఉంటుందని పేర్కొన్నారు. 16 రోజులు నిద్ర లేకపోతే.. ఉదయాన్నే బయటకు వదిలినప్పుడు చెట్టు కింద పడుకొని నిద్రపోయేవాడినని రేవంత్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news