టెన్త్‌లో 10 GPA సాధిస్తే ఇంటర్‌లో ఫ్రీ అడ్మిషన్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్. దీనికి కోసం ఓ కమిటీ కూడా వేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవి మట్టిలో మాణిక్యాలుగా రాణించిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
తెలంగాణలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులతో వందేమాతరం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన విద్యాదాత పురస్కారాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
విద్య, వ్యవసాయం ఈ రెండూ తమ ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన అంశాలని చెప్పారు. ఈ రంగాల్లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్న లక్ష్యంతోనే విద్య కమిషన్, వ్యవసాయ కమిషన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.