మూసీ సుందరీకరణ అనే పదం వాడిందే సీఎం రేవంత్ రెడ్డి : కేటీఆర్

-

మూసీ సుందరీకరణ అనే పదం వాడిందే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో మూసీ అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అన్నారు. అనంతగిరి గుట్టల్లో ఉధ్భవించిన మూసీ 265 కి.మీ. దూరం ప్రయాణం చేసి వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. 1591లో మూసీ నదిని నిర్మించారు. 1908లో పెద్ద వరద వచ్చి ఇబ్బంది పడ్డారు. దాదాపు 15000 మంది మరణించారు. దీంతో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సూచనల మేరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారు. హైదరాబాద్ లో ప్రాణ నష్టం కలుగకుండా ప్లాన్ చేశారు.

హైదరాబాద్ నడిబొడ్డున ఉండే హుస్సెన్ సాగర్ 1 టీఎంసీ మాత్రమే. మూసీ పశ్చిమ నుంచి తూర్పు వైపునకు ప్రవహిస్తుంది. 90 శాతం వాటర్ మూసీ నదిలోకి వస్తున్నాయి. మూసీలో నీరు వదిలితే నిలవదు. మూసీలో ఎక్కడ నీళ్లు నిలిచే పరిస్థితే లేదు అన్నారు కేటీఆర్. పైన వర్షం పడితే.. ఆ రెండు రిజర్వాయర్లు నింపి.. కిందికి పంపిస్తే ఎలాంటి ప్రమాదం జరగదు అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చెప్పారు. మూసీని మురికి కుంపంగా మార్చింది కాంగ్రెస్ నాయకులే అన్నారు. నగరంలోని ప్రతీ వాన చినుకు మూసీ నదిలోనే పడుతుందని తెలిపారు. మూసీ నది హైదరాబాద్ నగరంలో 57 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. 70 శాతం పారిశ్రామిక వ్యర్థాలు కూడా మూసీలోనే కలుస్తాయని తెలిపారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version