కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వెలమ జాతికి సంచి బియ్యం వండితే ఇంకా మిగులుతుంది… అందుకే KCR కులగణన సర్వేలో పాల్గొనలేదని బాంబ్ పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. “నేను ఆఖరి రెడ్డి సీఎం ను అయినా పర్వాలేదు.. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/11/kcr-revanth-reddy.jpg)
గాంధీ భవన్ లో కులగణన, ఎస్సీ వర్గీకరణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆయన మాట్లాడారు. “కులగణన నా కోసం.. నా పదవీ కోసం చేయలేదు. త్యాగానికి సిద్దపడే కులాల లెక్కలను పక్కాగా తేల్చాం. మా నాయకుడిని ఆదర్శంగా నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధం” సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన పై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరుగలేదన్నారు.
కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం
వెలమ జాతికి సంచి బియ్యం వండితే ఇంకా మిగులుతుంది… అందుకే #KCR కులగణన సర్వేలో పాల్గొనలేదు – సీఎం @revanth_anumula pic.twitter.com/jNao6xlZwY
— greatandhra (@greatandhranews) February 15, 2025