తెలుగు రాష్ట్రాలలో పునర్విభజనతో 84 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం చేపట్టే జన గణన ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో 50, తెలంగాణలో 34 కొత్త స్థానాల ఏర్పాటు కాబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఏపీలో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కు ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య పెరుగుతుంది.

2027 లో జనగణన పూర్తయ్యాక డిలిమిటేషన్ తో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పెంపు ప్రక్రియ జరగనుంది. దీంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా… 2028 సంవత్సరంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 2029 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి.