తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వన మహోత్సవం సందర్బంగా రుద్రాక్ష మొక్కను నాటారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. అటవీ శాఖ, HMDA ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.