ప్రైవేటు యూనివర్సిటీలపై ఉక్కు పాదం మోపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగ బద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయంబర్సుమెంటు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదిను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మౌళికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా విద్యను అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలన్నారు.