బడి లేని గ్రామ పంచాయతీ తెలంగాణలో ఉండొద్దు – సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో  జరిగిన విద్యాశాఖ సమీక్షలో అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే.

Telangana CM Revanth Reddy on schools

ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని సీఎం ఆదేశంచారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news