రాళ్లు, రప్పలు, మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములు ఉన్నవారికి బిగ్ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక ఈ భూములు ఉన్న వారికి రైతు భరోసా ఉండదని తేల్చి చెప్పారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములు.. మైనింగ్….రియల్ ఎస్టేట్ భూములకు… భరోసా ఉండదని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతు భరోసా ఇవ్వబోమని వెల్లడించారు.
తాజాగా కేబినేట్ సమావేశం జరిగిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు భరోసా లబ్ది దారులను గ్రామాల వారీగా సభలు పెట్టీ ప్రజలకు వివరిస్తామన్నారు. రాళ్లు, రప్పలు, మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములు ఉన్నవారు ఉంటే నేరుగా తప్పుకోండి అని సూచించారు. ఆర్థిక పరిస్థితి వెసులు బాటు పట్టి… రైతు భరోసాను 10 వేల నుంచి 12 వేలకు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు కూడా ఇస్తున్నామని… 12 వేలు కాబట్టి ఆర్థిక వెసులు బాటు పట్టి ఇస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.