చాలా శాతం హిందువులు హనుమంతుడిని ఎంతో ఆరాధిస్తూ ఉంటారు. పైగా ఎన్నో పూజలను కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారు. ఇలా చేయడం వలన హనుమంతుని ఆశీస్సులు పొంది ఎంతో ఆనందంగా జీవించవచ్చు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీన రావడం జరిగింది. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేసి ఆరాధించడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఎంతో సంతోషంగా జీవించాలంటే తప్పకుండా హనుమాన్ జయంతి రోజున పూజలు చేయండి.
జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే హనుమాన్ జయంతి రోజున ఇంట్లో హనుమంతుడి ఫోటోను పెట్టండి. ఇలా చేస్తే సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతికూల శక్తి తొలగిపోయి ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. ముఖ్యంగా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే హనుమంతుడి ఫోటోని ఇంట్లో ఉత్తర దిశలో పెట్టడం వలన మరింత ప్రయోజనం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. ఎప్పుడైతే ఉత్తరం దిశలో హనుమంతుడి ఫోటోను పెడతారో ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి రావు. కనుక హనుమంతుడి ఫోటోని ఉత్తరం వైపున పెట్టండి. ఇలా చేయడం వలన ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. దీంతో ఎంతో ఆనందంగా జీవించవచ్చు. పైగా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే తగ్గిపోతాయి.
హనుమంతుడుకు సంబంధించిన ఫోటోలు, విగ్రహాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అయితే వజ్రాసనంలో కూర్చున్న హనుమంతుడు ఫోటోకి మరింత ప్రత్యేకత ఉంది అని పండితులు చెబుతున్నారు. ఎప్పుడైతే వజ్రాసనంలో కూర్చున్న హనుమంతుడు ఫోటోను ఇంట్లో పెడతారో జీవితంలో ఉండే కష్టాలన్నీ తగ్గిపోతాయి అని నమ్ముతారు. అంతేకాకుండా హనుమంతుడు ఆశీర్వదిస్తున్నట్టు ఉండే ఫోటోను ఇంట్లో పెడితే అంతే ప్రయోజనం ఉంటుంది. కనుక ఇటువంటి హనుమంతుడి ఫోటోలను తప్పకుండా ఇంట్లో ఉంచండి. ఇలా చేస్తే సానుకూల శక్తి పెరిగి ఎంతో ప్రశాంతంగా జీవించవచ్చు.