రవీంద్ర భారతి లో జరిగే ఉగాది వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉగాది వేడుకలు రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే రవీంద్రభారతిలో జరిగే ఉగాది వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు.
ఉగాది వేడుకల అనంతరం రాజ్ భవన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళతారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశం కానున్న రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ఆ తర్వాత హుజుర్ నగర్ వెళ్తారు.