విండీస్ టెస్టు కెప్టెన్సీకి దిగ్గజ ఆటగాడు గుడ్ బై..

-

విస్టిండీస్ టెస్టు కెప్టెన్సీ నుంచి క్రెగ్ బ్రాత్‌వైట్ తప్పుకున్నాడు. తన రాజీనామాను క్రికెట్ వెస్టిండీస్‌(సీడబ్ల్యూఐ)కు అందజేశాడు.ఈ విషయాన్ని సీడబ్ల్యూఐ సోమవారం ధ్రువీకరించగా.. ఆలస్యంగా విషయం వెలుగుచూసింది. ‘టెస్టు కెప్టెన్‌గా బ్రాత్‌వైట్ అధికారికంగా వైదొలిగాడు. తన రాజీనామాను అందజేశాడు. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు కొత్త నాయకత్వం కోసం సమయాన్ని ఇచ్చాడు. 100 టెస్టులకు అతను రెండు మ్యాచ్‌ల దూరంలో ఉన్నాడు.

ఆసిస్‌తో సిరీస్‌ అతనికి స్పెషల్. అదనపు భారం లేకుండా బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నాడు’ అని విండీస్ క్రికెట్ బోర్డు పేర్కొంది. త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్‌‌ను ప్రకటిస్తామని సీడబ్ల్యూఐ పేర్కొంది.కాగా, టెస్టుల్లో బ్రాత్‌వైట్ నాయకత్వంలో 39 టెస్టులు ఆడిన విండీస్.. 10 మ్యాచ్‌ల్లో గెలిచింది.బ్రాత్‌వైట్ సారథిగా జట్టుకు కొన్ని అపురూప విజయాలు అందించాడు. 2022లో ఇంగ్లాండ్‌పై సిరీస్ నెగ్గిన కరేబియన్ జట్టు..గతేడాది గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version