నేడు భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం ఉండనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.. మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుంది భూభారతి పోర్టల్. పైలట్ ప్రాజెక్టులో సలహాలు, సూచనలు స్వీకరణ చేయనున్నారు. ప్రజల సూచనల ఆధారంగా పోర్టల్ అప్డేట్ చేశారు.

ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ నివాసంలో భూ భారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ,భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాష్, సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్ హాజరయ్యారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో రైతులకు అవగాహన కల్పించారు.