ఇవాళ రాత్రి కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో సీఎం రేవంత్ భేటీ

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీ వెళ్లారు. ఆయన వెంట సీఎస్ సహా ముఖ్య అధికారులు ఉన్నారు. ఇవాళ ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో వారు హస్తినకు చేరుకున్నారు. ఈ పర్యటనలో సీఎం ఇవాళ దిల్లీలో జరగనున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీ అనంతరం తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ, ఇతర అంశాలపై హైకమాండ్తో చర్చిస్తారు. అలాగే అసెంబ్లీ కష్టపడి పని చేసిన వారిలో ఎవరెవరికి ఏయే పదవులు ఇవ్వాలనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.

మరోవైపు ఇవాళ రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలవనున్నారు. సీఎంతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఈ సమావేశంలో నేతలు పాలమూరు- రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version