ఐఏఎస్, ఐపీఎస్ లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రోజుకి 18 గంటలు పనిచేయాలి. పనిచేయడం ఇష్టంలేకపోతే సీఎస్, డీజీపీలకు చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోండని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇష్యూ చేశారు. నకిలీ విత్తనాలు.
ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. ఆరుగాలం కష్టపడే రైతు నకిలీ విత్తనాల ద్వారా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నకిలీ విత్తనాలే కారణం అన్నారు. నకిలీ విత్తనాల వెనుక ఉన్న కార్పొరేట్ కంపెనీలు సేల్స్ కోసం ఏవరో ఏజంట్ ను అపాయింట్ చేస్తడు. ఏజంట్ విత్తనాలు అమ్ముతాడని వివరించారు. అధికారులు కంపెనీ మీద కేసు పెట్టకుండా లాస్ట్ పాయింట్ మీద కేసు పెట్టగానే మరుసటి రోజు విత్తనాల కంపెనీ పేరు మార్చుతాడని తెలిపారు. అంతకుముందు అన్న పేరు మీద లైసెన్సు ఉంటే తమ్ముడి పేరు మీద నడిపిస్తడు. అధికారులు నోటీసులు ఇవ్వగానే బోర్డు తిప్పేసి నకిలీ విత్తనాల దందా నడుస్తున్నదన్నారు.