తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పోస్టు పెట్టారు. కేటీఆర్ ను ఉద్దేశించి తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అభిమానులు… ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు.

ఆయన పేరుతో రక్తదానాలు కూడా చేస్తున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు. కేటీఆర్ బర్త్డే నేపథ్యంలో… రాజకీయ నాయకులు అలాగే సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… pic.twitter.com/Bu7MCvtg7S
— Telangana CMO (@TelanganaCMO) July 24, 2025