తెలంగాణ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్కో లైబ్రరీలో 60వేల పుస్తకాలు, 5వేల కంప్యూటర్లుంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 5వేల పాఠశాలలను మూసి వేసింది. దళితులను, గిరిజనులను విద్యకు దూరం చేయడమే.
ప్రపంచాన్నే ఏలే శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు తెలంగాణ ప్రజలకు ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతీ పేదవాడికి నాణ్యమైన విద్యనందించాలని మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఎవ్వరితోనైనా చెలగాటం ఆడొచ్చు.. కానీ టీచర్లతో చెలగాటం ఆడకూడదు. వారు తలుచుకుంటే.. ప్రభుత్వాలే కూలిపోతాయి. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యాశాఖను తన వద్దనే ఉంచుకొని విద్యాశాఖను ప్రక్షాళన చేసి.. అధికారుల సలహాలు తీసుకొని 34వేల మంది టీచర్లను బదిలీలు.. 21వేల మంది ప్రమోషన్లు ఇచ్చి ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించామని తెలిపారు.