సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఇక ఇవాళ జపాన్ పర్యటన కీలక ఒప్పందాలు ఉన్నాయ్. నేడు హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శన, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు ఉంటాయి. జపాన్-ఇండియా చాప్టర్ తో బిజినెస్ లంచ్ ఉంటుంది.

హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు రేవంత్ రెడ్డి. ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకోనుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఐంది.