ఏపీ లిక్కర్ స్కామ్ కేసు లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణ కు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ని అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు.. విచారణకు రావాలని పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే సిట్ విచారణకు సహకరిస్తానని చెప్పిన కసిరెడ్డి తాజాగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సిట్ అధికారులు మరింత నిఘా పెట్టి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం స్కాం జరిగిందని సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే నిందితులు విజయసాయి రెడ్డితో పాటు కసిరెడ్డి తండ్రిని సైతం విచారించారు. పలు కోణాల్లో ప్రశ్నించారు. అయితే కసిరెడ్డి మాత్రం విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న కసిరెడ్డిని ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకోవడం
సంచలనంగా మారింది..