నేడు సచివాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళతారు. విదేశి పర్యటన తరువాత మొదటి సారి సచివాలయంకు సీఎం రేవంత్ రెడ్డి వెళుతున్నారు. భారీ పెట్టుబడులు దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన జరిగింది.
ఇక ఇవాళ పెట్టుబడులను తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇవాళ లేదా రేపు ముఖ్యమంత్రి రేవంత్ మీడియా సమావేశం ఉంటుంది. ఇది ఇలా ఉండగా…ఢిల్లీ కర్తవ్యపథ్ లో జరిగే గణతంత్ర వేడుకల్లో మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం ప్రదర్శనకు ఎంపికైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడం వల్ల ఈ అవకాశం వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాబోయే రెండేళ్లు సైతం తెలంగాణ శకటం ప్రదర్శనకు కేంద్రం అనుమతించిందని తెలిపారు. స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి తెలిపేలా శకటాన్ని రూపొందించినట్లు సమాచారం.