ఖమ్మం నుంచి పోటీ చేయండి..సోనియాగాంధీని రిక్వెస్ట్‌ చేసిన సీఎం రేవంత్‌

-

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ ఛైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీకి ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కోరుతూ ఇప్ప‌టికే పీసీసీ తీర్మానించిన విష‌యాన్ని ఆయ‌న సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన త‌ల్లిగా రాష్ట్ర ప్ర‌జ‌లు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పారు. స్పందించిన సోనియా గాంధీ స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు.

CM Revanth requested Sonia Gandhi

న్యూఢిల్లీలోని సోనియా గాంధీ అధికారిక నివాసం 10, జ‌న్‌ప‌థ్‌లో ఆమెను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం సాయంత్రం క‌లిశారు. ముఖ్య‌మంత్రి వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర రెవెన్యూ, స‌మాచార‌, ప్ర‌సార శాఖ‌ల మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న హామీల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి తెలియ‌జేశారు. ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌లకు పెంచ‌డాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. బ‌స్సుల్లో ఇప్ప‌టికే 14 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేశార‌ని ఆయ‌న తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version