బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం.. శాసనసభలో సీఎం రేవంత్

-

పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీకి అండగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి పలుసార్లు చర్చించుకున్నారని చెప్పారు. సీఎంను మార్చుకునే విషయం కూడా మోదీ ఇక్కడే చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ కొన్ని చెబుతారని, కొన్ని దాస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ సంబంధం అని వ్యాఖ్యానించారు.

“పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీకి అనుకూలంగా పలు బిల్లులకు ఓటు వేశారు. అప్పుడే వీరి బంధం బాహ్యప్రపంచానికి తెలిసిపోయింది. బీఆర్ఎస్‌లో ఉన్న అప్పటి కొందరు మంత్రులు ఆ సమయం లో సీఎంగా ఉన్న కేసీఆర్‌ను గద్దె దించాలని, ఆయన స్థానంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై అవిశ్వాస తీర్మానం చేయాలని నిర్ణయించారు కూడా. విషయం తెలుసుకున్న కేసీఆర్ మోదీ వద్దకు వెళ్లారు. నన్ను మా పార్టీలో సీఎం పదవి నుంచి తప్పుకోమంటున్నారు. నా కుమారుడిని సీఎం చేయాలనుంటున్నారు. అందుకే నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటాను. కేటీఆర్‌ను సీఎం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండని కేసీఆర్ మోదీని అనుమతి అడిగారు. తాను వారసత్వ రాజకీయాలను సమర్థించను అని మోదీ కేసీఆర్ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ప్రధాని మోదీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వయంగా చెప్పారు.” అని అసెంబ్లీలో రేవంత్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version