కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి దండలు వేసుకొని నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని 25వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్ లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తెలిపారు.
ధర లేక ఈ సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్ కు ఇరవై ఐదు వేల రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటలు విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
కౌన్సిల్ ఆవరణలో మిర్చి దండలు వేసుకొని నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయింది కానీ ధర… pic.twitter.com/aHx5mZt2C8
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2025