సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు(సోమవారం) పంజాబ్ రాష్ట్రానికి వెళ్లనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్ ఉదయం హైదరాబాద్ నుంచి పంజాబ్‌కి బయలుదేరనున్నట్టు సమాచారం. అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత సాయంత్రం తిరిగి HYDకు చేరుకుంటారని తెలుస్తోంది.
కాగా, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేడు జరగనుంది. ఈ మూడు జిల్లాల్లోని 4.63 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసి పలు ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక బరిలో ప్రధాన పార్టీల నుంచి తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.