కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారు : సీఎం రేవంత్

-

కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ.. హైదరాబాద్‌కు అనేక పరిశ్రమలు కేటాయించారని, భెల్‌, బీడీఎల్‌, ఇక్రిశాట్‌ను ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల ప్రజలు జీవిస్తున్నారని.. దేశం నలుమూలల నుంచి వచ్చి ఆనందంగా బతుకుతున్నారని చెప్పారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో మెదక్‌ జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. దుబ్బాకను రఘునందన్‌రావు అభివృద్ధి చేస్తానన్నారు.. చేశారా..? అని నిలదీశారు.

మెదక్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. దుబ్బాకకు మోదీ ఇచ్చిన నిధులెన్నో చెప్పగలరా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. మెదక్ ప్రాంతానికి కేంద్రం ఏదైనా పరిశ్రమ ఇచ్చిందా? అనిి నిలదీశారు. మోదీ పాలనలో చేనేతకారుల జీవితాలు చితికిపోయాయని విమర్శించారు. పేద ముదిరాజ్‌ బిడ్డకు మెదక్‌ టికెట్ ఇచ్చాం.. గెలిపించే బాధ్యత మీది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version