సీఎం రేవంత్ సింగపూర్ టూర్ సక్సెస్.. STT డేటా సెంటర్ భారీ పెట్టుబడి..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృంందం సింగపూర్ పర్యటన రెండో రోజు విజయవంతమైంది. రాష్ట్రంలో రూ.3500 కోట్ల పెట్టుబడులకు STT మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. ముచ్ఛర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ లోని STT గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ ను ఇవాళ సందర్శించారు. 

కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా సీఎం సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, STT గ్రూపు సీఈవో బ్రూనో లోపెజ్ ఈ ఒప్పందం పై సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్ ని ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. 

Read more RELATED
Recommended to you

Latest news