ఎస్సీ వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణీని అవలంభిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి అయ్యాకే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాదిగ బిడ్డలు ఉద్యోగాల విషయంలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణీ మానుకోవాలని హితవు పలికారు.
బయటకు మాదిగలకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తున్నా.. లోలోపల మాలలకు ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మాదిగ యువతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 06న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రి వర్గం ముక్తకంఠంతో ఆమోదం తెలిపింది.