తెలంగాణకు కోకా కోలా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. సిద్దిపేటలో 647 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసింది కోకా కోల సంస్థ. తాజాగా సిద్దిపేట జిల్లాలోని తన ప్లాంట్‌లో అదనంగా 647 కోట్ల పెట్టుబడికి నిర్ణయం తీసుకుంది కోకా కోలా కంపెనీ.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంత్రి కేటీఆర్‌తో కోకాకోల సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి సమావేశమయ్యారు. వరంగల్ లేదా కరీంనగర్ ప్రాంతంలో తన రెండో నూతన తయారీ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత చూపింది కోకా కోలా కంపెనీ. తెలంగాణలో తన పెట్టుబడులను రెట్టింపు చేయడం ద్వారా మొత్తంగా ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో 2500 కోట్లు పెట్టుబడి పెట్టింది కోకా కోల సంస్థ. కోకా కోల సంస్థ చరిత్రలో ఇంత వేగంగా భారీ పెట్టుబడి, విస్తరణ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.