హైదరాబాదులోని బంజారాహిల్స్ లో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద్భంగా డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రజలకు భరోసానిస్తుందన్నారు. దేశం గర్వించేలా ఈసీసీసి తెలంగాణకే గర్వకారణం అన్నారు. 2014లో సికింద్రాబాద్లో జూన్ 2న కేసీఆర్ కమాండ్ కంట్రోల్ ఆలోచన తనకి చెప్పారని అన్నారు. పోలీస్ శాఖకు మేము అడగకపోయినా ప్రభుత్వ అధినేతగా ప్రతిసారి పోలీస్ శాఖకి సీఎం మేలు చేశారని కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ కి ఎప్పుడు అండగా ఉందన్నారు మహేందర్ రెడ్డి. 8 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి లో పోలీస్ శాఖ కీలక బాధ్యత నిర్వహించిందన్నారు. తాను హైదరాబాద్ సిపిగా ఉన్న సమయంలో విదేశీ పోలీసింగ్ గురించి తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ తనని అక్కడికి పంపించినట్లుగా తెలిపారు. విదేశాల్లో పోలీసింగ్ విధానం పై పూర్తి అధ్యయనం చేశామని.. నేరాలు చేసేవారు కొత్తకొత్త టెక్నాలజీలు ఆడుతున్నారని అన్నారు.
వారి కంటే రెండు అడుగులు ముందుగానే మనం ఉండాలన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరల్డ్ క్లాసు సదుపాయాలు ఉన్నాయన్నారు. ప్రపంచంలో ఇటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ లేదన్నారు డిజిపి మహేందర్ రెడ్డి