కారుణ్య నియామకాలు మీ హక్కు : సీఎం రేవంత్ రెడ్డి

-

కారుణ్య నియామకాలు మీ హక్కు అని  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా రవీంద్ర భారతిలో కొలువ పండుగ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ పలు పోస్టులకు ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.  ఈ సందర్భంగా  సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్టు తెలిపారు.  గత ప్రభుత్వం పదేళ్లుగా కారుణ్య నియామకాలు చేపట్టలేదన్నారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. గత పాలకుల నిర్లక్స్యం వల్ల ఉద్యోగాలు రాలేదన్నారు. ఈ సందర్భంగా బిల్డ్ నౌ పోర్టల్ ను ప్రారంభించారు. పది సంవత్సరాల నోటిఫికేసన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అన్ని నోటిఫికేషన్లు తాను ఇచ్చానని చెప్పడం లేదు. కొన్నింటికి మీరు నోటిఫికేషనప్ ఇచ్చారు. కొన్ని ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. మరికొన్ని మేము ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ పాలన నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. 10నెలల్లో మేము చేసిన పనిని మీరు పదేళ్లలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news