తెలంగాణలో బూతులకు మార్గదర్శకం చేసింది సీఎం రేవంత్ రెడ్డినే : సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్

-

తెలంగాణలో బూతులకు మార్గదర్శకం చేసింది సీఎం రేవంత్ రెడ్డినే అని  సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఒక బూతు తిడితే ప్రజలు పది తిడతారు. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసిన విషయం మాట్లాడుతూ.. ఆ సంఘటన మీద బట్టలు ఉడదీసి కొడతా అంటున్నాడు అంటే మహిళా జర్నలిస్టులనే ఆ మాట అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు, కార్యకర్తలకు ఏం సందేశం ఇచ్చినట్టు అని ప్రశ్నించారు.

జర్నలిస్టుల్లో ఫస్ట్ బూతులు మాట్లాడటం స్టార్ట్ చేసిందే తీన్మార్ మల్లన్న, ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. వాళ్ళే ముందు బూతులు మాట్లాడటం మొదలుపెట్టారు.. వేరే జర్నలిస్టులు ఎవరైనా బూతులు మాట్లాడారా? అని ప్రశ్నించారు. అద్దంకి దయాకర్ ఒక బూతు మాట మాట్లాడినందుకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు. రాజకీయంగా దెబ్బతిన్నారు.. మునుగోడు నియోజకవర్గ మీటింగులో అద్దంకి దయాకర్ నోరు జారడం వల్ల రాజకీయంగా కోలుకోవడానికి ఏడాదిన్నర పట్టింది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news